మంచిర్యాల (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 15
లోకేశ్వరం నారాయణ పాఠశాల విద్యార్థులు మానవతా దృక్పథంతో రూ.5,456 విరాళాన్ని సేకరించి, జిల్లా నస్పూర్‌లోని శ్రీ సాయి అనాథ ఆశ్రమానికి అందజేశారు. అనాథ పిల్లలకు అండగా నిలిచేందుకు ఈ సహాయాన్ని అందించారు.
అనాథ పిల్లలకు నారాయణ పాఠశాల విద్యార్థుల ఆపన్నహస్తం లోకేశ్వరం అనాథ పిల్లలకు అండగా నిలిచేందుకు లోకేశ్వరం నారాయణ పాఠశాల విద్యార్థులు మానవతా దృక్పథంతో రూ.5,456 విరాళాన్ని సేకరించారు. ఈ మొత్తాన్ని జిల్లా నస్పూర్‌లోని శ్రీ సాయి అనాథ ఆశ్రమానికి అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాతర్ల నారాయణ చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులకు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సేవాభావాన్ని పాఠశాల యాజమాన్యం అభినందించింది. చిన్న వయసులోనే సేవా భావం, మానవతా విలువలను పెంపొందించుకోవడం అభినందనీయమని పేర్కొంది.












