మిర్యాలగూడ, 8 September
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా, రూం టు రీడ్ మరియు మరో గ్రంథాలయ ఉద్యమ పిలుపులో భాగంగా, తెలంగాణలోని మిర్యాలగూడ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేందుకు మంగళవారం సామూహిక పఠన కార్యక్రమాలు నిర్వహించారు.
పుస్తక పఠనం పట్ల ఆసక్తినిపెంచడానికి..రూం టు రీడ్ : (మనోరంజని తెలుగు టైమ్స్) అంతర్జాతీయ అక్షరా స్యత దినోత్సవ సందర్భంగా రూం టు రీడ్, మరో గ్రంథాలయ ఉద్యమ పిలుపులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మిర్యాలగూడ డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచడానికి సామూహిక పుస్తక , కథా, పద పఠన కార్యక్రమంమంగళవారం నిర్వహించారని మరో గ్రంధాలయ ఉద్యమ నిర్వాహకులు కస్తూరి ప్రభాకర్ తెలిపారు. ఆయా పాఠశాలల్లో టీచర్లు చదవడం, విద్యార్థులచే చదివించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల్లో పఠన ఆసక్తి పెపొందించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గులాంఅహ్మద్ ఉన్నారు.











