గురువులను సన్మానించిన పాఠశాల విద్యార్థులు : గురు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రోజున తిలక్ నగర్ లోని డాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులకు పూలమాలలు, శాలువాలు అందించి తమ గౌరవాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ గూండా రాజయ్య మాట్లాడుతూ, విద్యార్థులు గురువులను పాటిస్తూ వారిఅడుగుజాడల్లో నడయాడుతూ , క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ , పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థులు గురువుల పట్ల చూపిన గౌరవం, అభిమానం అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సన్మాన పత్రాలను అందిస్తూ గురువులు పిల్లలకు విద్యతోపాటు సంస్కృతి సాంప్రదాయాలను అందిస్తూ ఆదర్శ ప్రాయంగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
గురువులను సన్మానించిన
Share:

సారాంశం
గురువులను సన్మానించిన పాఠశాల విద్యార్థులు
ముఖ్య విషయాలు
- గురువులను సన్మానించిన పాఠశాల విద్యార్థులు : గురు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రోజున తిలక్ నగర్ లోని డాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించారు.
- ఉపాధ్యాయులకు పూలమాలలు, శాలువాలు అందించి తమ గౌరవాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ గూండా రాజయ్య మాట్లాడుతూ, విద్యార్థులు గురువులను పాటిస్తూ వారిఅడుగుజాడల్లో నడయాడుతూ , క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
- కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ , పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థులు గురువుల పట్ల చూపిన గౌరవం, అభిమానం అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.
- ఈ సందర్భంగా పాఠశాల తరఫున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సన్మాన పత్రాలను అందిస్తూ గురువులు పిల్లలకు విద్యతోపాటు సంస్కృతి సాంప్రదాయాలను అందిస్తూ ఆదర్శ ప్రాయంగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3343ఆర్టికల్స్
4,20,542వ్యూస్
