నిర్మల్, 9 September
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న బాసరకు చెందిన దేవుని శివకుమార్‌ను ఆయన మిత్రులు ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న సార్ చేతుల మీదుగా శివకుమార్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని న ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న బాసరకు చెందిన దేవుని శివకుమార్‌ను మిత్రులు ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న సార్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా బాసర మిత్రులందరూ శివకుమార్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బాసర మిత్రులు పాల్గొన్నారు.











