బోత్, 15 September
బోథ్ నియోజకవర్గ కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ) 90వ వార్షికోత్సవాల పోస్టర్ను జిల్లా అధ్యక్షుడు మున్సిఫ్ ఆవిష్కరించారు. ఈ నెల 29, 30 తేదీల్లో హనుమకొండలో 90వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
బోథ్ నియోజకవర్గ కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ) 90వ వార్షికోత్సవాల పోస్టర్ను జిల్లా అధ్యక్షుడు మున్సిఫ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మాట్లాడుతూ, 29, 30 తేదీల్లో హనుమకొండలో 90వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యారంగ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. 90వ వార్షికోత్సవాలను విజయవంతం చేసేందుకు విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మున్సిఫ్, జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, ముక్రమ్, సమీర్, సాబీర్ తదితర నాయకులు పాల్గొన్నారు.












