ఓపిఎస్ పునరుద్ధించే వరకు పోరు తప్పదు :
మిర్యాలగూడ సెప్టెంబర్ 15 (మనోరంజని తెలుగు టైమ్స్)
ఉద్యోగ,ఉపాధ్యాయులకు ప్రస్తుతం అమలులో ఉన్న సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే వరకు ఉద్యమం చేయక తప్పదని ప్రధానోపాధ్యాయులు సైదిరెడ్డి, పిఆర్టీయు త్రిపురారం మండల అధ్యక్షులుసత్యనారాయణ, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ లు అన్నారు.మంగళవారం త్రిపురరాంమండలంలోని చెన్నైపాలెం ఉన్నత పాఠశాలలో సిపిఎస్ రద్దు కోసం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని భోజన విరామం సమయంలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ లో అమలులోకి వచ్చిన సిపిఎస్ తో ఉద్యోగ,ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఓపీఎస్ అమలు పరుస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తక్షణం అమలు పరచి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఓపిఎస్ అమలు పరచక పోతే వచ్చే అక్టోబర్ నెల నుంచి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైదయ్య,నరసింహ స్వామి,లక్ష్మీ,శ్రీనివాస్,విజయలక్ష్మి, నరేందర్,ఝాన్సీ, లలిత,మమత,ప్రాథమికపాఠశాలప్రధానోపాధ్యాయులుబాలు,ఉపాధ్యాయులు శ్రీనివాస్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.












