జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ (శ్రీ వెంకటేశ్వరస్వామి) ఆలయాన్ని మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు దర్శించుకున్నారు. ప్రతి ఏటా ఆనవాయితీగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ (శ్రీ వెంకటేశ్వరస్వామి) ఆలయాన్ని మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు దర్శించుకున్నారు. ప్రతి ఏటా ఆనవాయితీగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు. జెండా బాలాజీ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని భక్తులు చెబుతారు. మహారాష్ట్రలోని కాంధార్కు చెందిన తుకోజీ అనే భక్తుడు ప్రతి సంవత్సరం కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకునేవారు. ఒకసారి తిరుగు ప్రయాణంలో లో రాత్రి బస చేశారు. తాను బస చేసిన ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని ఆయన ఆకాంక్షించినట్లు చెబుతారు.
ఈ విషయం ప్రముఖులకు తెలియడంతో అప్పట్లో ప్రముఖ వ్యాపారి నర్సాగౌడ్ ముందుకు వచ్చి విరాళాల సేకరణ ద్వారా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. అప్పటి నుంచి జెండా బాలాజీ ఆలయానికి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా విఠల్‌రావు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల ప్రతినిధులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
వినాయక నిమజ్జనం మరుసటి రోజు జెండా జాతర ఆనవాయితీగా ఊరేగింపు పులాంగ్ వరకు నిర్వహించి, వారం రోజుల తర్వాత తిరుపతికి పంపిస్తారు. ఆలయ పూజారులు ఆంజనేయులు, నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ ఘనస్వాగతం పలికారు. పూజలు చేసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ రవీందర్ రావు, బి. శ్రీనివాస్ రావు, రాంకిషన్ రావు, మాజీ చైర్మన్ ప్రమోద్‌తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

