భైంసా మండలంలోని మాటేగాం గ్రామంలో కొలువుదీరిన కర్ర గణపతిని బీజేపీ సీనియర్ నాయకుడు, రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పాటిల్ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గణనాథుడికి ఆయన హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామ ప్రజలు, యువకులతో ఆయన మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వినాయక ఉత్సవాల నిర్వహణపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు మనోజ్ పాపిన్వార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.












