ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో దళారులు పేదల వద్ద నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి, వాటిని రైస్ మిల్లులకు తరలించి రీసైక్లింగ్ అనంతరం బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో తిరుగుతున్న కొందరు దళారులు పేదల వద్ద నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని పెద్ద మొత్తంలో రైస్ మిల్లులకు తరలించి, అక్కడ రీసైక్లింగ్ చేసిన అనంతరం తిరిగి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయిలోనే ఈ అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ తనిఖీలు, నిఘా చర్యలు ఎందుకు చేపట్టడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్ల వెనుక ఎవరున్నారు ఈ బియ్యం ఏయే రైస్ మిల్లులకు చేరుతోంది రీసైక్లింగ్ పేరుతో మార్కెట్లోకి ఎలా తరలిస్తున్నారు ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది
సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి గ్రామాల్లో రేషన్ బియ్యం కొనుగోళ్లపై నిఘా ఏర్పాటు చేయాలని, అనుమానిత రైస్ మిల్లులపై తనిఖీలు నిర్వహించి, అక్రమాలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.









