నిర్మల్, 8 September
నిర్మల్: మహా శాస్త్ర సేవా సంఘం అందించే అన్నపూర్ణ పురస్కార గ్రహీత, శ్రీ హరిహర క్షేత్రం మల్లన్న గుట్ట ఆలయ గురుస్వామి నవయుగ మూర్తిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సతీమణి శ్రీమతి అల్లోల విజయమ్మ, ఆలయ ధర్మకర్తలు శ్రీమతి అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
అన్నపూర్ణ పురస్కార గ్రహీతకు ఘన సన్మానం... నిర్మల్: మహా శాస్త్ర సేవా సంఘం ప్రతిష్టాత్మకంగా అందించే నంది పురస్కారాల్లో భాగంగా అన్నపూర్ణ పురస్కార గ్రహీత, శ్రీ హరిహర క్షేత్రం మల్లన్న గుట్ట ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి ని మాజీ మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సతీమణి శ్రీమతి అల్లోల విజయమ్మ – ఇంద్రకరణ్ రెడ్డి మరియు శ్రీ హరిహర క్షేత్రం మల్లన్న గుట్ట ఆలయ ధర్మకర్త శ్రీమతి అల్లోల వినోదమ్మ – మురళీధర్ రెడ్డి కలిసి అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గురుస్వామి నవయుగ మూర్తి నీ ఆధ్యాత్మిక, సామాజిక సేవా రంగాల్లో అందిస్తున్న సేవలను వారు ప్రశంసించారు. భక్తి, సేవా భావంతో ప్రజలకు చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా అన్నపూర్ణ పురస్కారం లభించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. వీరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు












