సారంగాపూర్, 7 September
రాబోయే గణేష్ ఉత్సవాల నేపథ్యంలో, మండలంలో డీజే నిర్వాహకులతో పోలీసులు సమావేశమయ్యారు. శబ్ద పరిమితులు, రాత్రి సమయాల్లో సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిబంధనలను వారికి వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యల్లో భాగంగా 11 మంది డీజే నిర్వాహకులకు బైండ్ఓవర్ చేశారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజే నిర్వాహకులతో సమావేశం... 11మంది డీజే నిర్వాహకుల బైండోవర్.... మనోరంజని తెలుగు టైమ్స్ ఈ రోజు నిర్మల్ జిల్లా SP డా, జానకీ షర్మిల IPS ఆదేశాల మేరకు మండలంలో రాబోయే గణేష్ ఉత్సవాల నేపథ్యంలో డీజే నిర్వాహకులతో ఎస్. ఐ శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు జారీ చేసిన సూచనలు, నిబంధనలను వారికి వివరించి, గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. పరిమితికి మించి డీజే శబ్దాలు/బాక్స్ లు వినియోగించిన యెడల చట్ట రీత్యా చర్య తీసుకోబడును అని వివరించడం జరిగింది. మరియు రాత్రి 1000 గంటల తరువాత సౌండ్ సిస్టం వినియోగం పట్ల కూడా పరిమితులు ఉంటావని తెలియపరిచారు. అలాగే, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీజే నిర్వాహకులని 11 మందిని MRO ముందు హాజరు పరిచి,బైండ్ఓవర్ చేశారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు...

