సారంగాపూర్, 7 September
నిర్మల్ జిల్లా మండలంలో రాబోయే గణేష్ ఉత్సవాల నేపథ్యంలో డీజే నిర్వాహకులతో ఎస్సై శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. పరిమితికి మించి శబ్దాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజే నిర్వాహకులతో సమావేశం... 11మంది డీజే నిర్వాహకుల బైండోవర్.... మన తెలంగాణ నిర్మల్ జిల్లా మండలంలో రాబోయే గణేష్ ఉత్సవాల నేపథ్యంలో డీజే నిర్వాహకులతో ఎస్. ఐ శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు జారీ చేసిన సూచనలు, నిబంధనలను వారికి వివరించి, గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. పరిమితికి మించి డీజే శబ్దాలు/బాక్స్ లు వినియోగించిన యెడల చట్ట రీత్యా చర్య తీసుకోబడును అని వివరించడం జరిగింది. మరియు రాత్రి 1000 గంటల తరువాత సౌండ్ సిస్టం వినియోగం పట్ల కూడా పరిమితులు ఉంటావని తెలియపరిచారు. అలాగే, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీజే నిర్వాహకులని 11 మందిని MRO ముందు హాజరు పరిచి,బైండ్ఓవర్ చేశారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు...












