బాల్కొండ, 10 September
నిజామాబాద్ జిల్లా మండలం చిట్టాపూర్ గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామ యువతకు టీషర్టులను పంపిణీ చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు అబ్బగోని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువతలో ఉత్సాహం వెల్లివిరిసింది.
చిట్టాపూర్‌లో వినాయక చవితి సందర్భంగా టీషర్ట్‌ల : నిజామాబాద్ జిల్లా మండలం చిట్టాపూర్ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గ్రామ యువతకు టీషర్ట్లను పంపిణీ చేశారు. భాజపా సీనియర్ నాయకుడు అబ్బగోని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులకు టీషర్ట్లను అందజేయడంతో వారిలో ఉత్సాహం, ఆనందం నెలకొంది. అనంతరం అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. వినాయక చవితి వేడుకలను ఆనందోత్సాహాలతో, సోదరభావంతో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


