హెయిర్ సెలూన్ షాపులకు 250 యూనిట్ల వరకు కరెంటు సబ్సిడీ బిల్లులు చెల్లించడం లేదని, ఈ విషయంపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మంగళవారం మిర్యాలగూడ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తిదారులైన నాయి బ్రాహ్మణులకు షాపునకు 250 యూనిట్ల వరకు సబ్సిడీ రాయితీ కల్పించిందని, కానీ కటింగ్ షాపులకు మాత్రం ఈ బిల్లులు వర్తించడం లేదని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కుల వృత్తిదారులైన నాయి బ్రాహ్మణులకు సబ్సిడీ కరెంటు బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు కోరారు.
అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలలో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అలగడప గిరిధర్, గౌరవ అధ్యక్షుడు వెలిజాల హనుమంతు, జంపాల సత్యనారాయణ, కృష్ణమూర్తి, గోలి యాదగిరి, పట్టణ అధ్యక్షుడు రాయించు నరసింహ, కార్యదర్శి మేడిపల్లి సైదులు, కోశాధికారి రాచమల్ల వెంకన్న, నాగబెల్లి యాదగిరి, జంపాల పాండు, ఇటికాల సత్యనారాయణ, మిర్యాలగూడ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


