స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఏఐ సంస్థ షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను నవంబర్ 15, 2026 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్, ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యాన్ని బట్టి ధరలు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పెరగనున్నాయి. పెరుగుతున్న విడిభాగాల ధరలు, తయారీ ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
ధరల పెంపు వివరాలు
ఏఐ పల్స్ 2 ఎఫ్ఈ (4జీబీ 64జీబీ) ప్రస్తుత ధర 8,999 నుంచి 10,999కి పెరగనుంది. ఏఐ పల్స్ 2 (4జీబీ 64జీబీ) కూడా ఇదే ధరతో 10,999కి చేరనుంది. ఏఐ పల్స్ 2 (6జీబీ 128జీబీ) ధర 10,999 నుంచి 12,999కి పెరుగుతుంది. ఏఐ నోవా 2 5జీ (4జీబీ 64జీబీ) ధర 11,999 నుంచి 13,999కి, (6జీబీ 128జీబీ) ధర 13,999 నుంచి 15,999కి మారనుంది.
అలాగే, ఏఐ నోవా 2 నియో 5జీ (4జీబీ 128జీబీ) ధర 12,999 నుంచి 15,999కి, ఏఐ నోవా 2 పవర్ 5జీ (8జీబీ 128జీబీ) ధర 16,999 నుంచి 19,999కి, ఏఐ నోవా 2 ప్రో 5జీ (8జీబీ 128జీబీ) ధర 17,999 నుంచి 19,999కి, ఏఐ నోవా 2 అల్ట్రా 5జీ (8జీబీ 128జీబీ) ధర 19,999 నుంచి 22,999కి పెరగనున్నాయి. కొన్ని నోవా సిరీస్ మోడళ్ల ప్రస్తుత ధరల్లో బ్యాంకు ఆఫర్లు వర్తించవచ్చు. కొనుగోలు సమయంలో అందుబాటులో ఉన్న ధరలను పరిశీలించాలి.
నోవాఫ్లిప్ 5జీ ధరలో మార్పు లేదు
ఏఐ నోవాఫ్లిప్ 5జీ ధరను మాత్రం కంపెనీ పెంచలేదు. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఉన్న రూ.49,999 ధరతోనే అందుబాటులో ఉండనుంది. ధరల పెంపు ప్రధానంగా బడ్జెట్, మధ్యస్థ ధరల విభాగాల్లోని పల్స్ 2, నోవా 2 సిరీస్ ఫోన్లపై ప్రభావం చూపనుంది.
స్మార్ట్‌ఫోన్ తయారీకి అవసరమైన మెమరీ చిప్‌లు, ఇతర విడిభాగాల ధరలు పెరగడంతో పాటు తయారీ, రవాణా ఖర్చులు అధికమవుతున్నాయని కంపెనీ పేర్కొంది. ఈ అదనపు భారంలో కొంత భాగాన్ని సంస్థ ఇప్పటివరకు భరించినప్పటికీ, వ్యాపార నిర్వహణను కొనసాగించేందుకు ధరల సవరణ అవసరమైందని తెలిపింది. ఇటీవల ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచుతున్నాయి. దీంతో తక్కువ బడ్జెట్లో కొత్త ఫోన్ కొనాలనుకునే వినియోగదారులు తమకు కావాల్సిన మోడల్‌ను లోపు కొనుగోలు చేస్తే ప్రస్తుత ధర ప్రయోజనం పొందవచ్చు. అయితే, ధరల పెంపు ప్రతి మోడల్‌కు ఒకే విధంగా ఉండదని గుర్తుంచుకోవాలి.

