తానూర్, 5 October
మండలంలోని ఝారి గ్రామంలో ఇటీవల మరణించిన గడ్డేమొల్ల రుక్మభాయి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే భోంస్లే నారాయణ్ రావు పటేల్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మండల కేంద్రంలోని ఝారి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన గడ్డేమొల్ల రుక్మభాయి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, మాజీ శాసన సభ్యులు గౌరవ శ్రీ భోంస్లే నారాయణ్ రావు పటేల్ గారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రుక్మభాయి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఝరి సర్పంచ్ బాబన్నా, వడ్గామ్ సర్పంచ్ గోవింద్ రావు పటేల్, తానూర్ మండల అధ్యక్షులు పుండలీక్, మాధవరావు పటేల్, మాజీ ఎంపీపీ చంద్రకాంత్, మధు పటేల్, లక్ష్మణ్, డాక్టర్ యోగేష్, వాగెమరి అనిల్ ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్ గంగాధర్ తదితర నాయకులు పాల్గొన్నారు.












