చిన్నకోడూరు, చంద్రపూర్ గ్రామంలో తెలంగాణ రైతు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ శేఖర్ గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ కనకయ్య, వార్డు సభ్యులు కే బిక్షపతి, అనిల్ రెడ్డి, రైతు జిల్లా అధ్యక్షులు చల్లారి తిరుపతిరెడ్డి, గ్రామ రైతు అధ్యక్షులు కిష్టారెడ్డి, కార్యదర్శి సంజీవ్ రెడ్డి, కోశాధికారి మల్లారెడ్డి హాజరై జెండాను ఆవిష్కరించారు.
కిసాన్ మహాసభలు, విధానాలపై చర్చలు
నల్గొండ జిల్లాలో అఖిల భారత కిసాన్ మహాసభలు 18వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ మహాసభలలో దేశంలో రైతాంగం పట్ల జరుగుతున్న విధానాలపై చర్చలు జరిగి, భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు కే బ్రహ్మం, ఐలయ్య, రంగదాసు, అంజయ్య గౌడ్, తిరుపతి వెంకటరెడ్డి, అభ్యుదయ రైతులు, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.











